తోడు దొంగల పాలనకు చరమగీతమే..!
– ధరలు పెంచిన మోడీ, కేసీఆర్‌లకు గుణపాఠం తప్పదు
– కాంగ్రెస్ దర్నా విజయవంతం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్రంలో ప్రధాని మోడీ, తెలంగణాలో సీఎం కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలేనని.. ధరలు పెంచి దోపిడికి పాల్పడుతున్న వారి పాలనకు ప్రజల చేతిలో చరమగీతం తప్పదని తాండూరు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నియోజకవర్గ స్థాయి దర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, సీనీయర్ నాయకులు జనార్దన్ రెడ్డి తదితరులు హాజరై పెంచిన పెట్రోల్, డీజీల్, విద్యుత్, ఆర్టీసీ చార్జీలతో, గ్యాస్ ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ దేశంలో మోడి, రాష్ట్రంలో కేసీఆర్ దోపిడి పాలన చేస్తున్నారని అన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతుల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేశారు. లేదంటే ప్రజల చేతిలో కేంద్ర ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదన్నారు. ఇప్పటికే తోడు దొంగల పాలనకు చరమగీతం పాడేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతల దర్నాను పోలీసులు భగ్నం చేసే యత్నం చేశారు. హోరెత్తిన నినాదాలతో పార్టీ నాయకులు దర్నాను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనీయర్ నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా మహిళ అధ్యక్షులు శోభారాణి, మండలాల అధ్యక్షులు భీమయ్య , రాజ్ కుమార్, గోపాల్ , శంకరప్ప, నవాజ్, నారా అశోక్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, ఉపాధ్యక్షులు మోయిన్, ఎన్ఎస్‌యూఐ తాండూరు అధ్యక్షులు సందీప్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు జలాల్, నాయకులు సమద్, జావిద్ ఖాన్, అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

