రేపు ఎస్టీ కార్పోరేషన్ లబ్దిదారుల ఎంపిక
తాండూరు, దర్శిని ప్రతినిధి: రేపు ఎస్టీ కార్పోరేషన్ కింద రుణాల కోసం దరఖాస్తున్న లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్, ఆర్డీఓ అశోక్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మద్యాహ్నం 2-30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఈ ఎంపిక జరుగుతుందని చెప్పారు. 2020-21 సంవత్సరానికి ఎస్టీ కార్పోరేషన్ కింద ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులను జాయింట్ ఐడెంటిఫికేషన్ క్యాంపు ద్వారా ఎంపిక చేయబోతున్నట్లు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులు దరఖాస్తు ఫారం,ఆధార్ కార్డు, కుల.. ఆధాయ దృవీకరణ పత్రాలను తీసుకుని హాజరుకావాలని సూచించారు.
