సుభాష్ చంద్ర‌బోస్‌ను అవ‌మాన‌ప‌రుస్తారా..!

తాండూరు వికారాబాద్

సుభాష్ చంద్ర‌బోస్‌ను అవ‌మాన‌ప‌రుస్తారా..!
– విగ్ర‌హ దిమ్మెను కూల్చడం అప్ర‌జాస్వామికం
– ఖండించిన నేతాజీ యూత్ క్ల‌బ్ స‌భ్యులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: స్వాతంత్ర స‌మ‌ర యోధుడు, ఆజాద్ హింద్ పౌజ్ ద‌ళ‌ప‌తి సుభాష్ చంద్ర‌బోస్‌ను అవ‌మానించేలా అధికారులు వ్య‌వ‌హ‌రించ‌డం త‌గ‌ద‌ని తాండూరు నేతాజీ యూత్ క్ల‌బ్ స‌భ్యులు మండిప‌డ్డారు. గురువారం తాండూరు మున్సిప‌ల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ప‌ట్ట‌ణంలోని శాంత్ మ‌హాల్ చౌర‌స్తాలో సుభాష్ చంద్ర‌బోస్ విగ్ర‌హా ఏర్పాటు దిమ్మెను కూల్చ‌డాన్ని క్ల‌బ్ స‌భ్యులు సోమ‌శేఖ‌ర్, న్యాయ‌వాది జ‌నార్ద‌న్ రెడ్డి, కోటం శంక‌ర్, ఘ‌నాపురం శంక‌ర్, కోటం సిద్దలింగం, కుంచెం ముర‌ళీధ‌ర్, జుంటుప‌ల్లి వెంక‌ట్, త‌దిత‌రులు ఖండించారు. ప‌ట్ట‌ణంలోని శాంత్ మహాల్ చౌరస్తాలో ద‌శాబ్దాల క్రిత‌మే రోడ్డు ప‌క్క‌న ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని వారు గుర్తుచేశారు. కొన్నేండ్ల క్రితం ప‌ట్ట‌ణంలోని రోడ్డు విస్త‌ర‌ణ జ‌ర‌గ‌డంతో రోడ్డు ప‌క్క‌న ఉన్న విగ్ర‌హాన్ని రోడ్డు మ‌ద్య‌లోకి తీసుక‌వ‌చ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం జ‌రిగింద‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ అనుమ‌తుల‌తోనే రోడ్డు మ‌ద్య‌లో దిమ్మెను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని గుర్తుచేశారు. అధికారులు కొంత‌మంది దుష్ట‌శ‌క్తుల మాట‌లు విని దిమ్మెను కూల్చ‌డం దుర్మార్గ‌మైన చ‌ర్య అని, దేశ స్వాతంత్ర స‌మ‌ర యోధుడైన సుభాష్ చంద్ర‌బోస్‌ను అవ‌మానించడ‌మేన‌ని అభివ‌ర్ణించారు. ప‌ట్ట‌ణంలో కొంద‌రు వ్య‌క్తులు ప్ర‌భుత్వ భూములు, నాలాలు క‌బ్జాలు చేస్తుంటే దానిపై స్పందించ‌ని అధికారులు విగ్ర‌హ దిమ్మెను కూల్చ‌డం సిగ్గుచేట‌న్నారు. అదేవిధంగా వినాయ‌క చౌర‌స్తాలో స‌ర్వాయి పాప‌న్న‌గౌడ్ విగ్ర‌హా దిమ్మెను కూల్చడాన్ని కూడ వారు ఖండించారు. దిమ్మెల‌ను కూల్చివేసిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.