నేడే భద్రేశ్వరుని రథోత్సవం
– రేపు లంకాదహనం
– ఏర్పాట్లు చేసిన చైర్మన్, ఈఓ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని ప్రసిద్ద భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవ వేడుకలను నేడు శనివారం రాత్రి 11-05 గంటలకు నిర్వహించనున్నారు. రేపు లంకాదహన వేడుకలను నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల రెండేళ్ల తరువాత జాతర ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. జాతర లోని రథోత్సవం, లంకాదహన వేడుకలకు సంబంధించి ఆలయ రెనోవేషన్ కమిటి చైర్మన్ బంటారం సుధాకర్, ఈఓ శేఖర్ గౌడ్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం ఉదయం నుంచి రథోత్సవాన్ని కుంభం అలంకరణ, సాయంత్రం కలశదారణ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మరోవైపు గత నాలుగు రోజులుగా భద్రేశ్వరుని పల్లకి సేవ, భజన కీర్తనలతో పాటు ఆలయంలో నిత్య అన్నధాన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి.

