బీజేవైఎం ప‌ట్ట‌ణ‌ ప్రధాన కార్యదర్శిగా తాండ్ర నరేష్

తాండూరు రాజకీయం వికారాబాద్

బీజేవైఎం ప‌ట్ట‌ణ‌ ప్రధాన కార్యదర్శిగా తాండ్ర నరేష్
– జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి యు.ర‌మేష్ కుమార్‌కు కృత‌జ్ఞ‌త‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: బీజేపి బ‌లోపేతానికి నిరంత‌రం కృషి చేయాల‌ని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా కార్య‌ద‌ర్శి యు.ర‌మేష్ కుమార్ అన్నారు. తాండూరు ప‌ట్ట‌ణ పార్టీ కార్యాల‌యంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో తాండూర్ బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శిగా తాండ్ర నరేష్‌ను నియ‌మించారు. జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి యు.ర‌మేష్ కుమార్ తాండ్ర న‌రేష్‌కు నియామ‌క‌ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా యు.ర‌మేష్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ ప‌టిష్టం చేయ‌డంలో బీజేవైఎం పాత్ర కీల‌క‌మైంద‌న్నారు. యువ‌త పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల‌న్నారు. అనంత‌రం తాండ్ర నరేష్ మాట్లాడుతూ రానున్న రోజులో బీజేపీ బలోపేతనికి తన వంతు చేయశక్తులు గా కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే తన పై నమ్మకం ఉంచి ప‌ద‌వి అప్ప‌గించ‌డం ప‌ట్ల జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి యు.ర‌మేష్ కుమార్, ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు సుద‌ర్శ‌న్ గౌడ్, పార్టీ రాష్ట్ర నాయ‌కుల‌కు, సీనీయ‌ర్ నాయ‌కులకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.