ధరణి పోర్టల్‌ను రద్దుచేయాలి
– ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్‌ను రద్దుచేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం తాండూరు పట్టణం ఆర్డీఓ కార్యాలయం ముందు సీఐటీయూ, కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ధరణి పోర్టల్ వల్ల రైతులు వివిధ భూ సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. కావున ధరణి పోర్టల్‌ను రద్దుచేయాలని అన్నారు. తాండూరు పట్టణంలో, యాలాల మండలంలోని గ్రామాల్లో పేదలకు ఇండ్ల స్థలాలు అందించాలని, ప్ఱభుత్వ, ఫారెస్ట్ భూములో సాగులో ఉన్న రైతులకు పట్టాలను అందించాలని, మోటేషన్, సక్సేషన్ వెంటనే అమలు చేయాలని, దళితబంధును ప్రతి గ్రామంలో అర్హులందరికి అందించాలని, ఉపాధి హామి కూలీ డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, కేవీపీఎస్ జిల్లా నాయకులు ఉప్పలి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘం నాయకులు కె.చంద్రయ్య, అబ్బని బసయ్య తదితరులు పాల్గొన్నారు.


