స్పూర్తి దాయకుడు అంబేద్కర్
– ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలి
– వర్ధంతిలో కాంగ్రెస్ నేతల నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత దేశ ప్రజాస్వామ్య స్పూర్తిని విశ్వవ్యాప్తం చేసిన డా. బీఆర్. అంబేద్కర్ అందరికి స్ఫూర్తి దాయకుడని తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. బుధవారం అంబేద్కర్ వర్థంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తాండూరు ఎమ్మెల్యే సోదరుడు బుయ్యని మనోహర్ రెడ్డి, నాయకులు మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్’ చేసిన కృషి ఎనలేనిదన్నారు. ప్రజా స్వామ్యంలో అందరికి స్వేచ్చ.. హక్కులను కల్పించిన స్ఫూర్తిదాయకుడు అని అభివర్ణించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సెల్, మైనార్టీ సెల్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

