ఘనంగా అయ్యప్ప పడిపూజ

తాండూరు రాజకీయం వికారాబాద్

ఘనంగా అయ్యప్ప పడిపూజ
– పూజలో పాల్గొన్న శుభప్రద్ పటేల్
– హాజరైన నేతలు, ప్రముఖులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం అయ్యప్ప నగర్ లోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం మణికంఠుని నామస్మరణతో మార్మోగింది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజ వైభవంగా జరిగింది. శుభప్రద్ పటేల్ తన కూతురు హన్వీక పుట్టిన రోజుతో పాటు పడిపూజ ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ ఆలయంలో వెలసిన అయ్యప్ప స్వామికి పూజలో భాగంగా అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పడిపూజలో భాగంగా అయ్యప్ప స్వామి పల్లకి సేవ నిర్వహించారు. అయ్యప్ప స్వాములు ఆలాపించిన భజన కీర్తనలు. నామస్మరణ మార్మోగింది. వేద పండితులు, గురుస్వాముల సమక్షంలో పడిపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శుభప్రద్ పటేల్ అయ్యప్ప స్వాములకు సద్ది ఏర్పాటు చేశారు. స్వాములకు అన్నదానం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, బీఆర్ఎస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీగౌడ్, నాయకులు సిద్రాల శ్రీనివాస్, ఫ్లోర్ లీడర్లు శోభారాణి, అంతారం లలిత, కౌన్సిలర్లు సాహు శ్రీలత, బోయరవి, రాము, బాలప్ప, కులసంఘాల నాయకులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, టీచర్లు, తదితరులు పాల్గొన్నారు. మరోవైపు శుభప్రద్ పటేల్ కూతురు హన్వీకకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

ఇది కూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం