కిట్ల పంపిణీలో కారు’చిచ్చు’..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

కిట్ల పంపిణీలో కారు’చిచ్చు’..!
– మ‌ళ్లీ ర‌చ్చ‌కెక్కిన టీఆర్ఎస్ వ‌ర్గ‌పోరు
– ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వ‌ర్గీయుల మ‌ద్య వాగ్వివాదం
– యాలాల‌, బ‌షీరాబాద్‌లో రంజాన్ కిట్ల పంపిణీలో ఉద్రిక్త‌త‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని టీఆర్ఎస్‌లో మ‌ళ్లీ కారుచిచ్చు ర‌గిలింది. మంగ‌ళ‌వారం యాలాల‌, బ‌షీరాబాద్ మండ‌లంలో ఏర్పాటు చేసిన ముస్లిం సోద‌రుల‌కు అందించే రంజాన్ కిట్ల పంపిణీ కార్య‌క్ర‌మం వేధిక‌గా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల మ‌ద్య వ‌ర్గ‌పోరు మ‌రోసారి ర‌చ్చ‌కెక్కింది. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ముందే ఇరువ‌ర్గీయులు రెచ్చిపోయారు. దీంతో కిట్ల పంపిణీ ఉద్రిక్త‌త‌ల మద్య కొనసాగింది.
ముందుగా యాలాల మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ తోఫా కిట్ల పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు హాజ‌ర‌య్యారు. స‌భా వేధిక‌పైకి యాలాల మండ‌ల అధ్య‌క్షులు ర‌వీంద‌ర్ రెడ్డి రావ‌డంతో ఎమ్మెల్సీ వ‌ర్గానికి చెందిన సిద్రాల శ్రీ‌నివాస్, సురేంద‌ర్ రెడ్డి త‌దిత‌రులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీంతో ర‌వీంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్సీ వ‌ర్గీయుల మ‌ద్య మాటా మాటా పెరిగింది. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎస్ఐ అర‌వింద్ ఆందోళ‌న కారుల‌ను చెద‌ర‌గొట్టె ప్ర‌య‌త్నం చేశారు. ఎమ్మెల్సీ వ‌ర్గీయుల‌ను మాత్ర‌మే త‌ర‌లిస్తుండ‌డంతో ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం ఎస్ఐ అర‌వింద్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అనంత‌రం అంద‌రిని అక్క‌డి నుంచి త‌ర‌లించ‌డంతో ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది.
మ‌రోవైపు బ‌షీరాబాద్ మండ‌లంలో ఏర్పాటు చేసిన రంజాన్ కిట్ల పంపిణీలో మ‌ళ్లీ సేమ్ సీన్ రీపీట్ అయ్యింది. కార్య‌క్ర‌మంలో ప్రోటోకాల్ పాటించ‌డం లేద‌ని ఎమ్మెల్సీ వ‌ర్గీయులు అభ్యంతరం తెలిపారు. ఎంపీపీ క‌రుణ అజ‌య్ ప్ర‌సాద్, గ్రామ స‌ర్పంచ్ ను ఆహ్వానించ‌డ‌కుండా కార్య‌క్ర‌మం ఎలా నిర్వ‌హిస్తార‌ని మండిప‌డ్డారు. ఇందుకు ఎమ్మెల్యే వ‌ర్గీయులు ఇంద‌ర్ చెడ్ రాజు, రాజార‌త్నం త‌దిత‌రులు జోక్యం చేసుకోవ‌డంతో ఎమ్మెల్సీ వ‌ర్గీయులు జెడ్పీటీసీ శ్రీ‌నివాస్ రెడ్డి, అజ‌య్ ప్ర‌సాద్‌ల మ‌ద్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త‌త‌ల మ‌ద్య రంజాన్ కిట్ల పంపిణీని పూర్తి చేశారు. యాలాల‌, బ‌షీరాబాద్ మండ‌లాల్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వ‌ర్గీయుల మ‌ద్య మ‌రోసారి వ‌ర్గ‌పోరు బ‌హిర్గ‌తం కావ‌డంతో రాజకీయ చ‌ర్చ‌కు దారితీసింది.