యాలాల టీఆర్ఎస్‌లో అలజడి
– సిద్రాల శ్రీనివాస్ సభ్యత్వం తొలగింపు
– మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ప్రకటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలో మంగళవారం టీఆర్ఎస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ వేడి చల్లారకముందే యాలాల మండలం టీఆర్ఎస్ పార్టీలో మరో అలజడి రేగింది. యాలాల మండలంలో టీఆర్ఎస్ సీనీయర్ నేత సిద్రాల శ్రీనివాస్‌ను పార్టీ సభ్యత్వం నుంచి తొలగిస్తున్న విడుదలై ఓ ప్రకటనే ఇందుకు కారణంగా మారింది. మంగళవారం యాలాల మండల పరిషత్ కార్యాలయంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్ల పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయమై టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, మాజీ మండల ప్రెసిడెంట్ సిద్రాల శ్రీనివాస్‌ల మద్య వాగ్వివాదం కూడ జరిగింది. అయితే ఈ సమావేశంలో సిద్రాల శ్రీనివాస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారి పట్ల అమర్యాదగా సంబోధించారంటూ రవీందర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సిద్రాల శ్రీనివాస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని, పార్టీ నుంచి ఆయను తొలగిస్తున్నట్లు రవీందర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో యాలాల మండలంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయుల వర్గపోరు మరింత అలజడిని సృష్టించింది.



