ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి
– ప్రతి పరీక్షా కేంద్రంలో సౌకర్యాలు తప్పనిసరి
– గ్రామీణ విద్యార్థులకు రవాణా సదుపాయంపై దృష్టి
– వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుడూత మే 6, నుండి 23 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో 9,350 ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు, 8,215 ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులు, మొత్తం 17,565 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఇందుకోసం జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 32 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇంటర్ పరీక్షల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని విద్యార్థులకు, ఇబ్బందులు కల్గకుండా పరిక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రం ఒక ANM తో పాటు వైద్య సిబ్బంది ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో పరీక్ష ప్రశ్నపత్రాలను నిల్వ ఉంచేందుకు, తరలించేందుకు పోలీసు ద్వారా బందోబస్తు కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేసి, పరీక్షా సమయాలలో జిరాక్స్ సెంటర్లు మూసిఉంచేలా చూడాలన్నారు. తప్పనిసరిగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందకు ప్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. పరీక్షకు ముందు తరువాత విద్యార్థుల సౌకర్యార్థం సకాలంలో బస్సులు నడపాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్ నాయక్, ఏఎస్పి (డిటీసి) మురళీధర్, డిఎస్సి సత్యనారాయణ, జిల్లా, వైద్య అధికారి తుకారం, ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వాహకులు బుచ్చయ్య, రాజా మోహన్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.


