సీతారాముల కళ్యాణ వైభోగం..!
– తాండూరులో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
– ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– సందడి చేసిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతమంతా రామనామ స్మరణలో తరించింది. నియోజకవర్గంతో పాటు తాండూరు పట్టణమంతా రామమయంగా మారింది. ఆదివారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ దేవాలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవాలు వైభోగంగా జరిగాయి.

పట్టణంలో ప్రసిద్ది చెందిన స్టేషన్ హనుమాన్, ఇందిరానగర్లోని రాంమందిర్, సీతారాంపేట్ హనుమాన్ దేవాలయం, సాయిపూర్ హనుమాన్ దేవాలయం, మల్రెడ్డిపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం, రసూల్పూర్ అభయ హనుమాన్ దేవాలయాలలో ఆయా దేవాలయాల చైర్మెన్లు, ఆలయ కమిటి సభ్యులు, సంఘాలతో పాటు వివిధ కాలనీలలో సంఘాల ఆధ్వర్యంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవాలను ఉదయం నుంచి శుభలగ్న సుమూహూర్తములో వేద పండితుల మంత్రోచ్చరణల మద్య సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. నీలమేఘశ్యాముడు జనకుని కూతురు సీతమ్మ మెడలో మాంగళ్యధారణ చేస్తుండగా తరలివచ్చిన అశేష భక్తజనవాహిని తన్మమయంతో పులకించి జయ జయ ద్వానాలు చేశారు.
పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు పట్టణంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలో ఇందిరానగర్, సాయిపూర్, స్టేషన్ హానుమాన్, సీతారం పేట్ హనుమాన్ దేవాలయాలతో పాటు పలు ప్రాంతాలలో నిర్వహించిన వేడుకలలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గోని సీతారాములను దర్శించుకున్నారు.

ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడడ్, డీసీసీబీ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బంటు మల్లప్ప, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, బోయరవి, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవి కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్ కుమార్, బంటు వేణు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఉదయ్ భాస్కర్ రెడ్డి, తులసీరాం, నాయకులు బోయరాజు, యువకులు తదితరులు ఉన్నారు.
సందడి చేసిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
శ్రీరామ నవవి సందర్భంగా తాండూరు పట్టణంలో ఇందిరానగర్, సీసీఐ కాలనీ, స్టేషన్ హానుమాన్, సీతారంపేట్ హనుమాన్ దేవాలయాలతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సందడి చేశారు.

ఆయా దేవాలయాలు, ప్రాంతాలలో సీతారాములను దర్శించుకుని పూజలు నిర్వహించారు. రోహిత్ రెడ్డి వెంట మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా సర్సింలు, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మహిళ కన్వీనర్ శకుంతల, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, వీరేందర్ రెడ్డి, నర్సిరెడ్డి, చెన్ బసప్ప, కరుణాకర్, మాజీ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, యువనాయకులు సందీప్ రెడ్డి, శేఖర్ రెడ్డి, గోపాల్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

