మత సామరస్యాన్ని కాపాడుకుందాం

తెలంగాణ

మత సామరస్యాన్ని కాపాడుకుందాం
– ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: అన్ని వర్గాల పండుగల్లో ఉన్న మత సామరస్య సారాన్ని కాపాడుకుందామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్లో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హాజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు మత సామరస్యాన్ని పెంపొందిస్తాయన్నారు. అన్ని వర్గాల పండుగలను ఆదర్శంగా తీసుకుని కుల మతాలకు అతీతంగా నిలిచే పండుగ సారాన్ని కాపాడుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తం, పట్టణ మాజీ అధ్యక్షులు ఆబ్దుల్ రవూఫ్, డీసీసీబీ జిల్లా డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, నాయకులు మసూద్, కో – ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవీ, మాజీ కౌన్సిలర్ సయ్యద్ జుబైర్ లలా, బీదర్ శేఖర్, యువ నాయకులు బిర్కట్ రఘు, దత్తాత్రేయ, కోట్ల రాజ్ కుమార్ రెడ్డి, గణేష్ నింబల్కర్, సిద్దు అయ్యా, మంగలి శ్రీనివాస్, ముస్లిం పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.