మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం
– టీఆర్ఎస్ కేవి తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు గోపాల్
తాండూరు, దర్శిని ప్రతినిధి: కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించే మే డే ఉత్సవాలు విజయవంతం చేయాలని టీఆర్ఎస్ కేవి తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు గోపాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మేడే సందర్భంగా 1వ తేదిన తాండూరు పట్టణంలోని మెట్రో గార్డెన్ ఫంక్షన్‌లో ఉద్యోగ, కార్మిక గౌరవ సన్మాన సమ్మేళన కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వ్యతిరేక విధానాలకు కార్మికులందరూ ఏకమై ముందుకు అడుగు వేయాలన్నారు. తాండూరు పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న మే డే ఉత్సవాలలో ప్రతి ఒక్క కార్మికుడు హాజరై కార్మిక శక్తిని లోకానికి చాటాలన్నారు. అనంతరం శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. కార్మిక సమ్మెళనంలో భారీ ఎత్తున పాల్గొనాలని, మేడే ఉత్సవాన్ని జయప్రదయం చేయాలని సూచించారు.

