భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు

తాండూరు రాజకీయం వికారాబాద్

భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు
– సామూహిక ప్రార్థనలలో పాల్గొన్న వేలాది ముస్లిం సోదరులు
– శుభాకాంక్ష‌లు తెలిపిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరులో వైభవంగా రంజాన్ పండుగను మంగ‌ళ‌వారం భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో జరుపుకున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన ఉపవాస దీక్షల అనంతరం ఈద్-ఉల్-పితర్ గా పిలుచుకునే రంజాన్ పండుగ సందర్భంగా పట్టణ సమీపంలోని చెన్ గెసేపూర్ రోడ్డు మార్గంతో పాటు హైదరాబాద్ రోడ్డు మార్గంలో కొత్తగా ఏర్పాటు చేస్తోన్న ఈద్గా మైదానంలో పురుషులు, మహిళలు, ముస్లిం సోదరులు వేల సంఖ్యల్లో పాల్గొని అందరికి మంచి జరగాలని సామూహిక ప్రార్థనలు చేశారు. పండుగలోని ప్రధానంగా చెప్పుకునే జకాత్‌ను దృష్టిలో ఉంచుకుని పేదవారికి డబ్బులు దానం చేశారు. ఇక మహిళలు ఇంట్లోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పండగను పురుస్కరించుకుని సన్నిహితులకు ఇంట్లోకి పిలిచి ప్రత్యేక వంటకాలను రుచిచూపించారు. పండుగ ప్రత్యేకమై షీర్ కుర్మాను తాగించారు. ప్రశాంత వాతావరణంలో పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
ముస్లిం సోదరుల రంజాన్ పండుగ సందర్భంగా ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేంద‌ర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

సామూహిక ప్రార్థనలు చేసే ఈద్గాల‌ వద్దకు చేరుకుని తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్, తాండూరు మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్, టీపీసీసీ ఉపాధ్య‌క్షులు ఎం.ర‌మేష్ మ‌హ‌రాజ్ త‌దిత‌రుల‌తో కలిసి ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈద్గా క‌మిటిల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
అనంతరం ఈద్గాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఈద్గా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ముస్లిం సోద‌రులు కోరిన విధంగా వ‌చ్చే రంజాన్ పండ‌గ నాటికి 10 ఎక‌రాల‌లో స్మ‌శాన వాటికకు స్థ‌లం కేటాయిస్తామ‌న్నారు.

ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటి అధ్యక్షులు యూసుఫ్ ఖాన్, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం), డీసీసీబీ మాజీ చైర్మ‌న్ ల‌క్ష్మారెడ్డి, డీసీసీబీ ఉమ్మ‌డి జిల్లా డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ గౌడ్, మాజీ డీపీసీ స‌భ్యులు ప‌ట్లోళ్ల న‌ర్సింలు, ప‌ట్లోళ్ల న‌ర్సింలు, మార్కెట్ క‌మిటి వైస్ చైర్మ‌న్ వెంక‌ట్ రెడ్డి, మాజీ చైర్మ‌న్ వ‌డ్డె శ్రీ‌నివాస్, టీఆర్ఎస్ నాయ‌కులు డాక్ట‌ర్ సంప‌త్ కుమార్, రాజుగౌడ్, శ్రీ‌నివాస్ చారి, సాయిపూర్ బాల్ రెడ్డి, మ‌సూద్, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు శ్రీ‌నివాస్, సంతోస్ గౌడ్, టీఆర్ఎస్ వై రాష్ట్ర నాయ‌కులు బిర్క‌డ్ ర‌ఘు, కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు ప్ర‌భాక‌ర్ గౌడ్, నాయ‌కులు జ‌నార్ద‌న్ రెడ్డి, అలీం, యూత్ కాంగ్రెస్ నాయ‌కులు సంతోష్ కుమార్, ఎన్ఎస్ యూఐ తాండూరు అధ్య‌క్షులు సందీప్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.