వైభవంగా బసవేశ్వరుని విగ్రహ ప్రతిష్టాపన

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభవంగా బసవేశ్వరుని విగ్రహ ప్రతిష్టాపన
– పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– హాజ‌రైన‌ శ్రీశ్రీశ్రీ షడక్షరీ వాసుదేవ మహాశివయోగి స్వామి  
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మండలం బెల్కటూర్ గ్రామంలో శ్రీ జగజ్యోతి బసవేశ్వర స్వామి విగ్రహా ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం బసవ జయంతి సందర్భంగా గ్రామంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం ఓన్నాలు, ఆందోళ్ సుక్షేత్ర జవార్గి శ్రీశ్రీశ్రీ షడక్షరీ వాసుదేవ మహశివయోగి స్వామి సమక్షంలో బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు పాల్గొన్నారు. విగ్రహా ప్రతిష్టాపన అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మ‌హ‌శివ‌యోగి స్వామివారిని దర్శించుకుని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీని ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల‌, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీఆర్ఎస్ మండ‌ల పార్టీ అధ్య‌క్షులు రాందాస్, మార్కెట్ క‌మిటి వైస్ చైర్మ‌న్ వెంక‌ట్ రెడ్డి, తాండూరు మార్కెట్ క‌మిటి మాజీ చైర్మ‌న్ వ‌డ్డె శ్రీ‌నివాస్, సర్పంచులు రాజప్ప గౌడ్, మేఘనాథ్ గౌడ్, ఎంపీటీసీ ఈశ్వరమ్మ, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, పట్లోళ్ల నర్సింలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.