అన‌ర్హుల రేష‌న్ కార్డుల‌ స‌రెండ‌ర్‌పై దృష్టి

జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

అన‌ర్హుల రేష‌న్ కార్డుల‌ స‌రెండ‌ర్‌పై దృష్టి
– లేదంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వు, కేంద్ర ప్రభుత్వం హెచ్చ‌రిక‌
ద‌ర్శిని డెస్క్ : రేష‌న్ కార్డుల ద్వారా ఉచితాల‌ను పొందుతున్న అన‌ర్హులు త‌మ కార్డుల‌ను స‌రెండ‌ర్ చేసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం దృష్టిసారిస్తోంది. నేష‌న‌ల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్టు -2013 కింద కేంద్ర ప్రభుత్వం దారిద్ర్య రేఖ‌కు దిగువ‌న ఉన్న పేద‌ల‌కు రేష‌న్ కార్డుల‌ను అందించిన విష‌యం తెలిసిందే. దీనిని ఫుడ్ సెక్యూరిటీ కార్డుగా పిలుస్తారు. ప‌లువురు కార్డు దారులు అన‌ర్హులు అయిన‌ప్ప‌టికి రేష‌న్ కార్డుల‌ను పొందారు. ఇప్పుటు వాటిని స‌రెండ‌ర్ చేసుకోవాని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. అన‌ర్హులు సౌక‌ర్యాలు పొంద‌కుండా చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఒక‌వేళ కార్డు య‌జమానులు కార్డుల‌ను స‌రెండ‌ర్ చేయ‌క‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రిస్తోంది.

ఎవరెవరు రేషన్ కార్డు సరెండర్ చేయాలంటే..

100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ నిడివి గల ఇల్లు లేదా ఫ్లాట్, కారు లేదా ట్రాక్టర్, గ్రామంలో రూ.2 లక్షలకంటే ఎక్కువ వార్షికాదాయం, నగరాల్లో రూ. 3 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం గల వారు సంబంధిత తహసీల్దారు గానీ, డీఎస్వో ఆఫీసులో గానీ రేషన్ కార్డు సరెండర్ చేయాలి. అర్హతలు లేకపోయినా రేషన్ కార్డు పొందినా, ఉపయోగించినా చట్టపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనర్హులు రేషన్ కార్డుల్ని ఉపయోగిస్తున్నట్టైతే ప్రభుత్వానికి సరెండర్ చేయాలి.

అర్హులు ఎవరంటే..?

గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 లోపు, నగరప్రాంతాల్లో రూ.2,00,000 లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు రేషన్ కార్డులు పొందేందుకు అర్హులు. రూ.3.5 ఎకరాల లోపు పంటపొలాలు, రూ.7.5 ఎకరాల లోపు బీడు భూమి ఉన్నవారు కూడా రేషన్ కార్డు తీసుకోవచ్చు. ఈ తాజా నిబంధనల ప్రకారం.. రూ.10 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారిని మాత్రమే దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నకుటుంబాలుగా గుర్తించి కార్డు జారీ చేస్తారు. ఎల్లో రేషన్కార్డు పొందాలంటే.. కుటుంబంలో డాక్టర్, న్యాయవాది, ఆర్కిటెక్, చార్టర్డ్ అకౌంటెంట్ ఉండకూడదు. వార్షికాదాయం రూ.15 వేల వరకు ఉన్న కుటుంబాలు. ప్రొఫెషనల్ టాక్స్, సేల్స్ టాక్స్, ఇన్కమ్ టాక్స్ చెల్లించని కుటుంబాలు. రెసిడెన్షియల్లో ఫోన్, కారు, కుటుంబంలోని సభ్యులందరికీ కలిపి రెండు హెక్టార్ల మెట్ట, హెక్టార్ మాగాణి, కరువు ప్రాంతాల్లో అర్థ హెక్టార్ భూమి కూడా లేని వారిని మాత్రమే అర్హలుగా పరిగణిస్తారు.