మార్కెట్ కమిటి ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఫిక్స్
– 5న తాండూరులో ఏర్పాట్లు
– హాజరు కానున్న స్పీకర్, మంత్రులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గ ప్రమాణ స్వీకారంకు ముహుర్తం ఖరారు అయ్యింది. ఆగస్టు 5న ప్రమాణ స్వీకారంకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా సాయిపూర్ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్గా మదికొండ నర్సిరెడ్డి, సభ్యులుగా ఎండీ అజ్మత్ అలీ, కె.జర్నప్ప, రాథోడ్ తులసీ రాం, మహమ్మద్ ఖరీం, కోటం ఉదయ్ భాస్కర్ రెడ్డి, ఈడిగి నర్సింహ గౌడ్, ఉప్పరి మొగులయ్య, బిస్మీల్లా బీ, గొనెగారి శ్రీనివాస్, మేకల రాజు, సీహెచ్ బోజిరెడ్డి, ఎం. మాణిక్యం, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఏడీ, మున్సిపల్ చైర్ పర్సన్లను పేర్లను ప్రకటిస్తూ ఈనెల 5న ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే.
కొత్తగా ఏర్పాటైన పాలకవర్గం చేత ఆగస్టు 5వ తేదిన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరవుతున్నారు. ఉత్తర్వులు వెలువడిన సరిగ్గ నెల రోజులకు పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది.
ఇదికూడ చదవండి…

