సవ్యంగా సెకండ్ ఇయర్ పరీక్షలు
– రెండో రోజు 102 మంది గైర్హాజరు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. రెండో సంవత్సరం మొదటి పరీక్షలు సవ్యంగా జరిగాయి. పరీక్షలను దృష్టిలో ఉంచుకుని కేటాయించిన 9 పరీక్షా కేంద్రాలలో 2441 విద్యార్థులకు ఆలార్ట్ చేయగా 102 మంది విద్యార్థులు గైర్హాజరై 2339 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో జనరల్ విభాగంలో 2004 మందికి గాను 79 మంది గైర్హాజరు కాగా ఒకేషనల్ విభాగంలో 437 మందికి గాను 23 మంది గైర్హాజరు అయినట్లు కస్టోడియన్లు మల్లినాథ్, కృష్ణయ్యలు తెలిపారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు కేంద్రాలలో విద్యార్థులకు తాగునీటి, వైద్య సదుపాయం కల్పించడంజరిగిందని చెప్పారు. పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు నిర్ణీత సమయానికంటే ముందు కేంద్రాలకు చేరుకుని పరీక్షాలను రాయాలని సూచించారు.

