మహోన్నతుడు పొట్టి శ్రీరాములు
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– తాండూరులో పొట్టి శ్రీరాములకు నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలుగు జాతి కోసం సేవలు, ప్రాణ త్యాగం చేసిన అమర జీవి పొట్టి శ్రీరాములు మహోన్నతుడు అని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. గురువారం తాండూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం సమీపంలోని పొట్టి శ్రీరాములు పార్కులో 71వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, ఆర్యవైశ్య సంఘం, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగు జాతి కోసం, ఆంధ్రరాష్ట్ర అవరతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం వీరేందర్, ప్రధాన కార్యదర్శి కోట మురళికృష్ణ, ఉపాధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్, మాజీ అధ్యక్షులు కొన్ని తిప్పయ్య, అలంపల్లి సిద్దం, మాజీ కార్యదర్శి ఆకారం శివకుమార్, గౌడంపల్లి రమేష్, కార్యవర్గ సభ్యులు కొంపల్లి నర్సింలు, సత్యనారాయణ, మిర్యాల సంతోష్ కుమార్. కోడూరు వినోద్ కుమార్, నర్సింలు, తర్లపల్లి సుధాకర్ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

