ఆర్డీఓపై ఆరోపణలు అవాస్తవం

క్రైం తాండూరు వికారాబాద్

ఎవ్వరికి డబ్బులు ఇవ్వలేదు
– ఆర్డీఓపై ఆరోపణలు అవాస్తవం
– మున్సిపల్ లాస్ట్ గ్రేడ్ ఉద్యోగులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఉద్యోగం విషయంలో ఎవ్వరికి ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని తాండూరు మున్సిపల్ లాస్ట్ గ్రిడ్ ఉద్యోగులు తెలిపారు. గతనెల మున్సిపల్ చైర్ పర్సన్ భర్త మున్సిపల్‌లో ప‌నిచేస్తున్న‌ 7 మంది ఉద్యోగుల వద్ద ఆర్డీఓ రూ. 12 లక్షల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణను వారు ఆదివారం ఓ ప్రకటనలో ఖండించారు. అందులో ఆరుమంది ఉద్యోగులు ఎవ్వరికి ఎలాంటి డబ్బులు ఇవ్వలేదన్నారు. ఆర్డీఓపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు గులా ముస్తఫా, డి.సురేష్, పి.అనంతయ్య, సురేష్, నర్సింలు, లక్ష్మమ్మలు ఉన్నారు.