పేదల ఆరోగ్యానికి అండ‌

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పేదల ఆరోగ్యానికి అండ‌
– సీఎంఆర్ఎఫ్ చెక్కు అంద‌జేసిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: పేద‌ల ఆరోగ్యానికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సీఎంఆర్ఎఫ్ ప‌థ‌కం వారికి అండ‌గా నిలుస్తోంద‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని విజ్ఞాన్ పూరి కాలనీకి చెందిన సాయి శివ శరణ్, శాంతి నగర్ కు చెందిన బి.రవీందర్‌ల‌కు సీఎంఆర్ఎఫ్ కింద ఎల్ఓసీ చెక్కులు మంజూర‌య్యాయి. గురువారం తాండూరు ఎమ్మెల్సీ నివారంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ల‌బ్దిదారుల‌కు అంద‌జేశారు. అనంత‌రం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నదన్నారు. సీఎంఆర్ఎఫ్‌తో ఎటువంటి కష్టమొచ్చినా ఆత్మీయ భరోసా ఇస్తుంద‌న్నారు. నిరుపేద‌లు ఈ ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ డీపీసీ స‌భ్యులు పట్లోళ్ల నర్సింలు, మార్కెట్ క‌మిటి మాజీ చైర్మెన్ వడ్డే శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయ‌కులు పట్లోళ్ల బాల్‌రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, యువ‌నాయ‌కులు బి. రఘు, తాండ్ర రాకేష్, సమీ, కోట్ల రాజ్ కుమార్ రెడ్డి, దత్తాత్రేయ త‌దిత‌రులు ఉన్నారు.