ప్రజా సమస్యలన్ని పరిష్కరిస్తాం
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– తాండూరు మండలంలో పల్లెపల్లెకు ఎమ్మెల్సీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పల్లెల్లో ప్రజా సమస్యలన్ని పరిష్కరిస్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో చేపట్టిన పల్లె పల్లెకు ఎమ్మెల్సీ కార్యక్రమం తాండూరు మండలంలో కొనసాగింది. శనివారం మండలంలోని అల్లపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని దేవాలయంలో పూజలు నిర్వహించి గ్రామ సర్పంచ్ నందిని యాదయ్య గౌడ్ సమక్షంలో ప్రజలతో సమావేశం అయ్యారు. గ్రామంలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పలు సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చొరవ చూపుతామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహాకారంతో గ్రామాలను అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పుర్తోషతం రావు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, తాండూర్ మండల కో – ఆప్షన్ సభ్యులు శంశోద్దిన్, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, మల్కాపూర్ పండరి, బాబు పటేల్, మాజీ AMC డైరెక్టర్ హమీద్, హన్మంతు రెడ్డి, వెంకటేష్, జగదీశ్వర్ రెడ్డి, పాండు, ప్రశాంత్ గౌడ్, నవీన్ గౌడ్, రమేష్, శ్రీనివాస్ గౌడ్,రమేష్, రాజేందర్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, టీఆర్ఎస్వై నాయకులు బిర్కడ్ రఘు, అశోక్ ముదిరాజ్, కోట్ల రాజ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,నర్సింహ, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

