బీజేపీ అంటేనే జూటా..!
– తెలంగాణలో బీజేపీని నమ్మేదే లేదు
– ఇచ్చిన హామిలను నెరవేర్చలేని కేంద్రం
– రైతులు, ప్రజల నడ్డి విరిస్తున్న మోడీ ప్రభుత్వం
– కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై రాజుగౌడ్ ఫైర్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : మత విద్వేషాలు, రెచ్చగొట్టే విషాలను నింపుకున్న జూటా పార్టీ బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మె పరిస్థితి లేదని వికారాబాద్ జిల్లా తాండూరు టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు రాజుగౌడ్ అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ ముగింపు సభకు హాజరైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను రాజుగౌడ్ ఖండించారు. అధికారం చేప్టిన ఎనిమిదేళ్లలో మోడీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమి లేదన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామిలను ఏ ఒక్కటి నెరవేర్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిని పార్లమెంట్‌లో పొడిగిందనే విషయాన్ని గుర్తుచేశారు. యేడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, జన్‌ధన్ ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామన్న మోడి ప్రగల్బాలు నీటిమూటలయ్యాయని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులకు ఎగనామం పెడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తామన్న ఇచ్చిన హామిలను నిలబెట్టుకోలేక పోయిందని ధ్వజమెత్తారు. రైతుల ఆధాయం పెంచుతామని చెప్పిన మోడి ఎరువుల ధరలను పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ధాన్యాన్ని కోంటామని మోసం చేసిన మోడి మళ్లీ అధికారంలోకి వస్తే కొంటామని చెప్పడం సిగ్గుచేటన్నారు. దీంతో పాటు గ్యాస్, పెట్రోల్, డీజీల్, నిత్యవసర ధరలను ఆకాశాన్ని అంటించి పేదలు, రైతుల నడ్డి విరుస్తున్నారని అన్నారు. కేంద్రం నీచమైన కుట్రలతో తెలంగాణపై విషం నింపుకున్న బీజేపీపై ప్రజలు నమ్మరన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవని, తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

