ధరణిలో కొత్త ఆప్ష‌న్‌

తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ధరణిలో కొత్త ఆప్ష‌న్‌
– అనువులేని భూముల‌న్ని పోట్ ఖరాబ్‌లోకి
– కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు, కీలక మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ స‌ర్కారు ప్ర‌వేశ పెట్టి ధరణిలో కొత్త ఆప్ష‌న్ అమ‌లు చేయ‌బోతున్నారు. “పోటు ఖరాబ్” కాలమ్ పేరుతో అందుబాటులోకి తీసుక‌వ‌స్తోంది. వ్యవసాయానికి అనువుగాలేని భూములను ప్రత్యేక ఖాతాలో రికార్డు చేసి ధరణిలో పొందు పర్చేలా సర్కార్ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ “పోటు ఖరాబ్” అనే ప్రత్యేక కాలమ్ వ్యవసాయ సాగు వినియోగానికి అక్కరకురాని భూములను చేరుస్తారు. వీటిని సేత్వార్, రెవెన్యూ రికార్డుల్లో నమోదుచేయనున్నారు. ఈ ఖాతాలో పేర్కొనేవాటిలో పశువుల షెడ్లు, పేడ గుంటలు, ఫామ్ హౌస్లు, భవ నాలు, వాటితో కప్పివేసిన అనుబంధ ప్రాంతాలను చేర్చనున్నారు. అదేవిధంగా రాళ్లు గుట్టలతో కల్పబడిన ప్రాంతం, కట్టలు, ఇరిగేషన్ ఛానల్, వాగులు, వర్రెలతో నిండి ఉన్న ప్రాంతాలను కూడా ఇందులో చేరనున్నారు. ప్రైవేట అటవీ భూములను కూడా ఈ వర్గీకరణలో పేర్కొంటారు. అదేవిధంగా రైతులు తమ వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసుకున్న ట్రాకర్ట్ షెడ్లు, నూర్పిడి ప్రాంతాలు, భూమి కోత, వరదల సమయంలో నష్టానికి గురై, మట్టితవ్వకాల ద్వారా పనికిరాకుండా పోయిన భూములు, ట్రాక్టర్, హార్వెస్టర్ల పార్కింగ్, వాటికి వేసిన రోడ్లు వంటివాటిని “పోటీ ఖరాబ్” విభాగంలో చేర్చాలని సీఎస్ సోమేష్ కుమార్ ఆదివారం నాడు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. “పోట్ ఖరాబ్” ఏరియా వివరాలను రికార్డులలో పొందుపర్చాలని, ఇందుకు నిర్దేశిత విధానాలను అమలు చేయాలని సూచించారు.

ఎలా చేస్తారంటే…
– రైతు నేరుగా తన పట్టాదార్ పాస్పుస్తకం వివరాలను, భూమి వివరాలను తెలుపుతూ ఆర్డీవోకు దరఖాస్తు చేయాలి. పోట్ ఖరాబ్ క్లెయిమ్ చేసిన భూమిని ఏవినియోగానికి వాడుతున్నారో ఇందులో పేర్కొనాలి.

– ఆర్డీవో సంబంధిత దరఖాస్తు ఆధారంగా ఆయా ప్రాంతాన్ని స్వయంగా క్షేత్రస్థాయిలో విచారించి “పోట్ ఖరాబ్”గా నమోదు చేయాలి. ఇందుకు ప్రోసీడింగ్లను జారీ చేస్తారు.

– ఆర్డీవో ఆమోదం తర్వాత “పోట్ ఖరాబ్” వివరాలను పట్టాదార్ పాస్ – పుస్తకంలోని రిమార్క్ కాలంలో నమోదు చేస్తారు. ఆయా వివరాలను ధరణి వెబ్సైట్లో పొందుపరుస్తారు