ఫ్లెక్సీ ద‌గ్దం బాధితుల‌కు ప‌రామ‌ర్శ‌

తాండూరు రాజకీయం వికారాబాద్

ఫ్లెక్సీ ద‌గ్దం బాధితుల‌కు ప‌రామ‌ర్శ‌
– ఇంటికి పల‌క‌రించిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో సంచలనమైన ప్లెక్సీ దగ్ధం సంఘటనలో దాడికి గురైన బాధితులను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. పాత తాండూరులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన ఫ్లెక్సీని దగ్ధం చేసిన ఘటనలో అదే కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు రహీం, తల్లి ఫాతిమా బేగంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. గురువారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాత తాండూరులోని వారి నివాసానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి జరిగిన సంఘటన గురించి ఆరా తీశారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకవచ్చారు. దీంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరు డీఎస్పీ జి. శేఖర్ గౌడ్ కు ఫోన్ మాట్లాడారు. బాధితుల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్సీ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, పీఏసీఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.