కేర్ మెగా వైద్య శిబిరానికి స్పందన

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

కేర్ మెగా వైద్య శిబిరానికి స్పందన
– 210 మందికి వైద్య పరీక్షలు, సేవలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు పట్టణం శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్లో హైదరాబాద్ కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. కేర్ ఆసుపత్రి వైద్యులు డా. భరత్ విజయ్ పురోహిత్ కార్డియాలజీ, డాక్టర్ ఉస్మాన్ న్యూమరాలజీ, డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆర్థోపెడిక్ విభాగాలలో వైద్య సేవలను అందించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వరకు నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో 210 మందికి వైద్య పరీక్షలు, వైద్య సేవలను అందించారు. ఈ శిబిరంలో శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి మాత్రమే హైదరాబాద్ కు రిఫర్ చేశారు. మిగతావారికి ఇక్కడే వైద్య సేవలను అందించారు. ఈ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివ‌రాల‌కు సెల్: 95339533775కు సంప్ర‌దించాల‌ని వైద్యులు సూచించారు.