స్పైస్ జెట్ విమానానికి త‌ప్పిన ప్ర‌మాదం

క్రైం జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

స్పైస్ జెట్ విమానానికి త‌ప్పిన ప్ర‌మాదం
– విమానం ఫ్యాన్‌కు చెల‌రేగిన మంట‌లు
– అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌తో 185 మంది సేఫ్
ద‌ర్శిని డెస్క్ : పాట్నా నుంచి దేశ రాజ‌ధాని వెళ్లే స్పైస్ జెట్ విమానానికి ప్ర‌మాదం త‌ప్పింది. స్పైస్‌జెట్ విమానంలో ఫ్యాన్‌కు మంట‌లు చెల‌రేగ‌డంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ నిర్ణ‌యంతో విమానంలో ఉన్న 185 మంది ప్ర‌యాణికులు సుర‌క్షితం అయ్యారు. ఆదివారం బీహార్‌లోని పాట్నా ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ వెళ్లే ఈ విమానాన్ని పాట్నా విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగటం గమనించిన సిబ్బంది చాకచక్యంగా వ్యవహించారు. ఘటన చోటు చేసుకున్న వెంటనే వెంటనే విమానాశ్రయ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై స్పైస్‌జెట్ కూడా వివరణ ఇచ్చింది. విమానం టేకాఫ్‌ కాగానే ఎడమ వైపు ఉన్న ఇంజిన్‌ను ఒక పక్షి ఢీకొట్టిందని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఆ ఇంజిన్‌లో మంటలు రావడాన్ని గమనించిన కేబిన్‌ సిబ్బంది వెంటనే పైలట్లను అలెర్ట్‌ చేసినట్లు చెప్పారు. పైలట్లు వెంటనే ఆ ఇంజిన్‌ను ఆపి వేశారని, అనంతరం విమానాన్ని పాట్నా ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారని వెల్లడించారు. ఆ తర్వాత మరో స్పైస్‌జెట్‌ విమానంలో ప్రయాణికులను ఢిల్లీకి చేర్చినట్లు వివరించారు. విమానం ఇంజిన్‌లో మంటలు రావడానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు స్పైస్‌జెట్ విమానం రెక్క వద్ద ఇంజిన్‌ నుంచి మంటలు, పొగలను గమనించిన పాట్నా ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని కొందరు స్థానికులు తమ మొబైల్‌లో రికార్డు చేసిన వీడియో క్లిప్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.