లోక్ అదాల‌త్‌ను స‌ద్వినియోగ ప‌ర‌చండి

తాండూరు వికారాబాద్

లోక్ అదాల‌త్‌ను స‌ద్వినియోగ ప‌ర‌చండి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: కేసుల రాజీ కోసం నిర్వ‌హించే జాతీయ లోక్ అదాల‌త్‌ను క‌క్షిదారులు స‌ద్వినియోగ పరుచుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. ఈనెల 26న నిర్వ‌హించే జాతీయ లోక్ అదాల‌త్‌పై జిల్లా పోలీసు యూనిట్ ఆఫీస‌ర్స్, జుడిష్య‌రీ ఆఫీస‌ర్ల‌తో జ‌రిగిన విడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా ఎస్సీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎస్సీ మాట్లాడుతూ ఈ నెల 26న నిర్వ‌హించే జాతీయ లోక్ ఆధాలత్ ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా పోలీస్ అధికారులు కూడా తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలలో పెండింగ్ లో వున్న స‌మ‌న్ల‌ను త్వరగా సర్వ్ చేయాలని ఆదేశించారు. కేసుల రాజీకీ అంగీక‌రించిన వారంతా లోక్ ఆధాలత్ కు హాజరయ్యేలా చూడాలని అన్నారు. నిర్ణ‌యించిన తేది ముందు రోజు వ‌ర‌కు లోక్ అదాలత్ యొక్క సమాచారం అందరికి తెలిసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అదేవిధంగా లోక్ ఆధాలత్ పైన ప్రజలలో అవగాహన క‌ల్పించాల‌ని అన్నారు. పోలీస్ అధికారులు సిబ్బందితో పాటు ఉన్నత అధికారులతో సమన్వయం పాటించి ప్రజలకు అవగాహన ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. యువతి యువకులు కూడా ఇట్టి విషయం పట్ల ప్రజలలో అవగాహన ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు.