ముందస్తు పన్నుల చెల్లింపులే మేలు
– ఎర్లీబర్డ్ ను సద్వినియోగం చేసుకోవాలి
– మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్‌సింగ్ ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలు ముందస్తు ఆస్తిపన్నులు చెల్లించడం వల్ల మేలు జరుగుతుందని తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. తాండూరు మున్సిపల్లో అమల్లోకి వచ్చిన ఎర్లీబర్డ్ పథకం కింద ఆమె వారికి సంబంధించిన ఆస్తి పన్నులు ముందస్తుగా చెల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఆస్తి పన్నులు ముందస్తుగా చెల్లిస్తే ఎర్లీ బర్డ్ పథకం ద్వారా 5శాతం రాయితీ దక్కుతుందని తెలిపారు. ఇలా ప్రజలు ఆస్తిపన్నులు చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందాలని, ఈనెల 30 వరకు అమల్లో ఉంటున్న పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదికూడా చదవండి….

