ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌ల్లో గ్రంథాయాలు

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌ల్లో గ్రంథాయాలు
– జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ ముర‌ళీకృష్ణ గౌడ్
– రెడ్డిగ‌ణాపూర్ పాఠ‌శాల సంద‌ర్శ‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌ల్లో గ్రంథాల‌యాలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు వికారాబాద్ జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ గాజీపూర్ ముర‌ళీకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. శ‌నివారం తాండూరు నియోజ‌క‌వ‌ర్గం బ‌షీరాబాద్ మండ‌లంలోని రెడ్డి ఘనాపూర్ ఉన్నత పాఠశాలను ఆయ‌న సంద‌ర్శించారు. పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల‌తో స‌మీక్షించి పాఠ‌శాల స్థితిగ‌తుల‌ను అడిగితెలుసుకున్నారు. అనంత‌రం మాట్లాడుతూ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా మ‌న ఊరు – మ‌న బ‌డి కార్య‌క్ర‌మం చేప‌డుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నత పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠ‌శాల‌ల ప‌రిస్థితుల ఆధారంగా గ్రంథాల‌య ఏర్పాటుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. గ్రంథాయాలతో విద్యార్థుల‌కు మెరుగైన విద్య అందుతుంద‌న్నారు.