ఎమ్మెల్యేను విమర్శిస్తే ఊరుకునేదిలేదు
– పార్టీని వీడితే స్వార్థం గుర్తుస్తొస్తుందా
– గెలిచే సత్తా లేక ఎన్నికల్లో ఓడిపోయారు
– అభివృద్ధిని చూసి వచ్చే కౌన్సిలర్లను స్వాగతిస్తాం
– కౌంటర్ ఇచ్చిన టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచే సత్తా లేని బీజేపీ పట్టణ అధ్యక్షుడు తాండూరు ఎమ్మెల్యేపై విమర్శలు చేసే అర్హత లేదని, నోరుజారితే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) అన్నారు. బీజేపీ కౌన్సిలర్లు సిందూజ గౌడ్, సంగీత ఠాకూర్ లు టీఆర్ఎస్లో చేరడంతో వారితో పాటు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై విమర్శలు చేయడాన్ని శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఖండించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరులో బ్రిడ్జి పనులు, బైపాస్ పనులు, మార్కెట్ కమిటి అభివృద్ధి, నేషనల్ హైవే రొ డ్డు పనులు జోరుగా జరుపుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ విమర్శలు చేయడం మంచిపద్దతి కాదన్నారు. ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి అతనికి లేదన్నారు. గతంలో స్వార్థ రాజకీయాలు చేసిన ఆయన అమ్ముడు పోయి ఓడిపోయారని ఆరోపించారు. కౌన్సిలర్‌గా గెలిచే సత్తాలేని ఆయన ఎమ్మెల్యేపై నోరుజారితే ఊరుకునేది లేదన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరే ఇతర పార్టీల కౌన్సిలర్ల చేరికను స్వాగతిస్తామన్నారు. అదే తరహాలోని బీజేపీ నుంచి ఫ్లోర్ లీడర్ సిందూజ గౌడ్, సంగీత ఠాకూర్లు టీఆర్ఎస్లో చేరారని తెలిపారు. వారి అభీష్టం మేరకు పార్టీని వీడితే వారికి స్వార్థాన్ని అంటగడతారా అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్లో చేరితేనే స్వార్థం, వ్యక్తిగత వ్యాపారాలు గుర్తుకొస్తాయా అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. మరోవైపు ఇటీవల పార్టీలో చేరిన కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ బీజేపీలో బలమైన నాయకత్వం లేకపోవడంతో పార్టీని వీడడం జరిగిందన్నారు. పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. బహిరంగా చర్చకు వస్తే స్వార్థ రాజకీయాలు బయట పెడతామని సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, ముక్తార్ నాజ్, భీంసింగ్ తదితరులు పాల్గొన్నారు.



