సెంటర్‌కు వెళ్లకుండా ఆధార్ అప్‌డేట్..!
– ఫోన్లలోనే చేసుకునే అవకాశం
– కొత్త నిర్ణయం తీసుకున్న కేంద్రం
దర్శిని డెస్క్ : అనేక కారణాల వల్ల ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోలేక పోయినవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డు అప్డేట్ ను వచ్చే ఏడాది జూన్ 30 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాక ఆధార్ అప్డేట్ కు మీసేవా..లేదా ఇతర ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగకుండా ఇంట్లోనే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునే విధానాన్ని కల్పించనుంది కేంద్ర ప్రభుత్వం.

ఆధార్ కార్డును ప్రతి పదేళ్లకోసారి అప్‌డేట్ చేయాలని సూచించగా, పిల్లల ఆధార్‌ను మాత్రం వారు 15 ఏళ్ల వయస్సు వచ్చే సరికి అప్డేట్ చేయాలన్నారు. ఇప్పటివరకు చిరునామా, పేరు, పుట్టిన తేది వంటి వివరాలను ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. కానీ ఫోటో, బయోమెట్రిక్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ మార్పుల కోసం మాత్రం ప్రజలు ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ రానున్న రోజుల్లో ఈ విధానం మారనుంది.

UIDAI ప్రకటించిన ప్రకారం.. నవంబర్ నాటికి ఓ కొత్త మొబైల్ యాప్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ యాప్ ద్వారా చాలా ఆధార్ అప్‌డేట్లు ఇంటి నుంచే చేసుకోవచ్చు. కేవలం బయోమెట్రిక్, ఐరిస్ స్కానింగ్ కోసం మాత్రమే కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి యాప్ అందుబాటులోకి వస్తే, ప్రజలు ఇంటి నుంచే ఆధార్ కార్డులో మార్పులు చేసుకునే సౌకర్యం పొందవచ్చు. దీనివల్ల ఆధార్ కేంద్రాల వద్ద ఉండే రద్దీ, టైమ్ వేస్ట్ తగ్గుతాయి.

ఇదికూడా చదవండి…

