బుట్టలో బుజ్జి బాహుబ‌లి

క్రైం తెలంగాణ హైదరాబాద్

బుట్టలో బుజ్జి బాహుబ‌లి
– వ‌ర‌ధ నీటి ముప్పునుంచి త‌ర‌లింపు
– పెద్ద‌ప‌ల్లి మంథ‌నిలో సంఘ‌ట‌న
హైదారాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : రాష్ట్రంలో కురుస్తున్న వ‌ర్ష భీభ‌త్సం రాజ‌మౌళీ బాహుబ‌లి సినిమాను గుర్తుకుతెచ్చింది. సినిమాలో బుట్ట‌లో బాహుబ‌హులిని నీటిపై మోసుకున్న సంఘ‌ట‌న నిజ జీవితంలో చోటుకుంది. పెద్దపల్లి జిల్లా(Peddapalli district) మంథని(Manthani)పట్టణంలో జ‌రిగిన దృశ్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. భారీ వ‌ర్షాల కార‌ణంగా మర్రివాడ మొత్తం జలదిగ్బంధం అయ్యింది. వరదనీరు చుట్టుముట్టడంతో ఓ ఇంట్లోని కుటుంబసభ్యులు డాబాపైకి ఎక్కారు. అందులో సుమ‌ల‌త అనే బాలింత‌తో పాటు 2 నెలల బాబు ఉన్నాడు. వారిని ఎలాగైనా కాపాడాలని కుటుంబ సభ్యులు తంటాలు ప‌డ్డారు. ఒకేసారి ఇద్ద‌రిని త‌ర‌లించేందుకు ఆటంకాలు ఏర్ప‌డ్డాయి. సుమలత బాలింత కావటంతో.. భుజాల వరకు వస్తున్న వరదల్లో నడిచేందుకు చాలా ఇబ్బంది పడింది. అయితే.. బాబును అక్క‌డే ఉంచి ఆమె అక్క కొడుకు రంజిత్.. సుమలతను గట్టిగా పట్టుకుని సురక్షితంగా వరద నీటిని దాటించి ఒడ్డుకు చేర్చాడు. అనంత‌రం బాబు వాళ్ల పెద్దనాన్న రామ్మూర్తి.. చిన్నోడిని సురక్షితంగా తీసుకెళ్లేందుకు కాస్త వినూత్నంగా ఆలోచించాడు. ఇంట్లో ఉన్న‌ ఒక పెద్ద బుట్ట లాంటి పాత్రలో పసికందును పడుకోబెట్టి.. చలి తగలకుండా వెచ్చగా ఉండేలా చుట్టూ దుస్తులు పెట్టాడు. బాహుబలి సినిమాలోని సీన్ మాదిరి.. ఆ బాబు ఉన్న పాత్రను రెండు చేతులతో పైకెత్తి పట్టుకుని.. జాగ్రత్తగా నడుస్తూ ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ దృశ్యాలను చుట్టుపక్కల ప్రాంతాల వారు వీడియో తీశారు. దీంతో నెట్టింట వైరల్‌గా మారాయి.

వీడీయో కోసం కింది వ‌ర‌కు చూడండి