ద‌ళితుల స్వయం ఉపాధికి ప్రాధాన్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

ద‌ళితుల స్వయం ఉపాధికి ప్రాధాన్యం
– ద‌ళితుబంధుతో అర్హుల‌కు ల‌బ్ది
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ట్రాక్ట‌ర్ల‌ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: దళితుల స్వ‌యం ఉపాధి కోస‌మే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఎర్కొన్నారు. తాండూరు పట్టణం సాయిపూర్ కు చెందిన దాసరి వెంకటప్ప, తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన కార్తిక్ లకు దళితబంధు ద్వారా ట్రాక్టర్లు మంజూరయ్యాయి. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఒక్కో రంగాన్ని, వర్గానికి మేలు చేస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. అందుబాగంగానే దళితుల అభ్యున్నతి కోసం. దళితబంధును ప్రవేశ పెట్టారన్నారు. ఈ పథకంలో అర్హుల స్వయం ఉపాధికి రాచబాట కలుగుతోందన్నారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో ఈ పథకం ద్వారా అర్హులందరికి లబ్ది చేకూరుతుందన్నారు. దళితబంధును సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పబ్లి ళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, అంతారం సర్పంచ్ రాములు, పెద్దేముల్ మండల అధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్, కౌన్సిలర్ సంగీత ఠాకూర్, కోఆప్షన్ సభ్యురాలు సారంగా, ప్రచార కార్యదర్శి సాగర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.