మమ్మేలూ.. మైసమ్మ తల్లీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మమ్మేలూ.. మైసమ్మ తల్లీ..!
– బోనమెత్తిన వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
– పాత తాండూరులో ఘనంగా బోనాల జాతర

తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: మమ్మేలూ… మైసమ్మ తల్లీ అంటూ భక్తులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు అక్కన్న మాదన్న కోటలోని కోట మైసమ్మ, మాణిక్ నగర్లోని మైసమ్మ దేవాలయాల్లో ఆషాఢ మాస జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా దేవాయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు, పూజలు చేశారు. జాతర ఉత్సవాల సందర్భంగా తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆయా దేవాలయాలను సందర్శించారు. అంతకుముందు దీపా నర్సింలు బోనం ఎత్తుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆషాఢ జాతర సంస్కృతిని పాటించడం ఎంతో సంతోషకరమన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎ స్ సీనీయర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, కౌన్సిలర్ సంగీత ఠాకూర్, కోఆప్షన్ సభ్యురాలు సారంగ విజయ్ కుమార్, మార్కెట్ కమిటి డైరెక్టర్ మ్లల్లప్ప తదితరులు ఉన్నారు.