ప్రసార భారతిలో 25 అసిస్టెంట్ ఏవీ ఎడిటర్ పోస్టులు
– 25 పోస్టుల భర్తికి దరఖాస్తుల ఆహ్వానం
దర్శిని డెస్క్: భారత ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ అయిన న్యూదిల్లీలోని ప్రసార భారతి ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ఏవి ఎడిటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఖాళీగా ఉన్న 25 పోస్టుల భర్తి చేసేందుకు ఈ దరఖాస్తులను కోరుతోంది. సౌండ్,వీడియో ఎడిటింగ్‌లో డిగ్రీ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని తెలిపింది. దీంతో పాటు సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలని చెప్పింది. వయసు 50 ఏళ్లు మించకుండా ఉండాలని, నెలకు రూ.30000 వేతనం చెల్లిస్తుందని పేర్కొంది. ఈ పోస్టులకు పరీక్షా, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించింది. అసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ప్రసార భారతి వెబ్సైట్లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.



