అందరి భవితకు తోడ్పాటు

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

అందరి భవితకు తోడ్పాటు
– జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్
– రాజుగౌడును సన్మానించిన పద్మశాలి సంఘం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్ని వర్గాల వారి బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తానని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ అన్నారు. ఆదివారం తాండూర్ పద్మశాలి సంఘం సభ్యులు రాజు గౌడ్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా రాజు గౌడ్ నియామకం కావడంపట్లసంతోషం వ్యక్తం చేస్తూ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా గ్రంథాలయాలను అభివృద్ధి చేసి అన్ని వర్గాల వారికి తోడ్పాటు అందించే విధంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. పద్మశాలి సంఘం సభ్యులు సన్మానించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు సంఘం అధ్యక్షులు ధూస రాములు, సెక్రటరీ గుండు గోపాల్, నల్ల పాపయ్య, వెంకటేశం, బిచ్చన్న, సుధాకర్, పాపయ్య, బుస పాండు, గుర్రపు నాగేశ్వర్, పనిఘంటి అనిల్, దూస ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.