పోర‌పాటున ఫోటో వ‌చ్చింది

క్రైం తెలంగాణ వికారాబాద్

పోర‌పాటున ఫోటో వ‌చ్చింది
– కిర‌ణ్‌కు పేకాట‌రాయుళ్ల‌తో సంబంధం లేదు
– ప్ర‌క‌ట‌న‌లో వివ‌ర‌ణ ఇచ్చిన క‌ర‌ణ్ కోట్ ఎస్ఐ
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: పేకాట నిందితుల‌తో పోర‌పాటున జ‌మాన‌త్ కోసం వ‌చ్చిన వ్య‌క్తి ఫోటో వ‌చ్చింద‌ని క‌ర‌ణ్ కోట్ ఎస్ఐ మ‌ధుసూధ‌న్ రెడ్డి తెలిపారు. తాండూరు మండ‌లం చెంగోల్ గ్రామంలో ఆదివారం పేకాట ఆడుతున్న 12 మంది వ్య‌క్తుల‌ను క‌ర‌ణ్ కోట్ పోలీసులు అరెస్టు చేసి సోమ‌వారం కేసు న‌మోదు చేశారు. ఈడ్గి రవిగౌడ్, వినోద్ చౌహాన్, కోయికుంట శ్రీనివాస్, అబ్దు రహీం, ఎండి ఇమ్రాన్, ఈడ్డి వెంకటయ్య గౌడ్, జ‌ర్పుల‌ ప్రకాష్, కేతావత్ విజయ్ కుమార్, షేక్ షహాబాజ్ బైగ్, రాథోడ్ రవి, మహమ్మద్ హరూన్, ఆర్తి రవిశేఖర్ పేర్లను కూడ వెల్ల‌డించారు. ఈ కేసుకు సంబంధించి విడుద‌లైన ఫోటోలో అలంప‌ల్లి కిర‌ణ్ కుమార్ అనే వ్య‌క్తి కూడ ఉన్నారు. పోలీస్టేష‌న్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ ఫోటోతో వార్త వైర‌ల్ అయ్యింది. మ‌రుస‌టి రోజు క‌ర‌ణ్ కోట్ ఎస్ఐ మధుసూద‌న్ రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అలంప‌ల్లి కిర‌ణ్ కుమార్‌కు పేకాట రాయుళ్ల‌తో సంబందం లేద‌ని, అత‌ను నిందితుల‌కు జ‌మాన‌త్ ఇచ్చేందుకు మాత్ర‌మే వ‌చ్చార‌ని స్ప‌ష్టం చేశారు. అనుకోని ప‌రిస్థితుల్లో పోరపాటున నిందితుల‌తో క‌లిసి ఉన్న కిర‌ణ్ ఫోటో వ‌చ్చింద‌ని తెలిపారు.