గంజాయి, గుట్కా అమ్మితే కఠిన చర్యలు
– తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ
– పట్టణంలోని కిరాణాషాపుల్లో స్పెషల్ డ్రైవ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: గంజాయి, గుట్కాలను అమ్మితే కఠిన చర్యలు తప్పవని తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ ఆదేశాల మేరకు గురువారం తాండూరు పట్టణంలోని పలు కిరాణా షాపుల్లో గుట్కా, గంజాయి నిల్వలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో ఎస్ఐలు గిరి, సతీష్‌లు షాపుల్లో తనిఖీలు చేపట్టారు.
గంజాయి, గుట్కా నిల్వలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో ఎలాంటి నిల్వలు లభ్యం కాలేదని డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. అయినప్పటికి ఎవరైనా గుట్కా, గంజాయి అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేసేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ట్రైనీ ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
