టీఆర్ఎస్ నేతలను పరామర్శించిన ఎమ్మెల్సీ

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

టీఆర్ఎస్ నేతలను పరామర్శించిన ఎమ్మెల్సీ
– గాజీపూర్ నారాయణ రెడ్డి దంపతుల ఆరోగ్యంపై ఆరా
– రాస్నం మాజీ సర్పంచ్ నారాయ‌ణ‌రెడ్డికి భరోసా
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గం యాలాల, పెద్దేముల్ మండలాల్లోని టీఆర్ఎస్ నేతలను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఆదివారం యాలాల మండలంలోని రాస్నం గ్రామ మాజీ సర్పంచ్ మంచన్ పల్లి నారాయణ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వెళ్లారు. అక్కడ నారాయణ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి ఆధైర్య పడొద్దు.. మనోనిబ్బరంగా ఉండాలని భరోసా అందించారు.
అదేవిధంగా తాండూరు పట్టణంలో జిల్లా గణాభివృద్ధి సంస్థ చైర్మన్ గాజీపూర్ నారాయణ రెడ్డి, ఆయన సతీమణిలను కూడ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. కొన్ని రోజుల నుంచి వారి ఆరోగ్యం కుదుట పడటం లేదని తెలుసుకుని వారిని పలకరించారు. అన్ని సమయాల్లో దైర్యంగా ఉండాలని, అలా ఉంటేనే దేనినైనా ఎదుర్కొంటామని అన్నారు. ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ చైర్మన్ సిద్రాల శ్రీనివాస్, నాయకులు గడ్డలి రవీందర్, అగ్గనూర్ సర్పంచ్ భీమప్ప, దేవనూర్ వెంకటయ్య గౌడ్, జక్కెపల్లి యాదవ రెడ్డి, పెద్దేముల్ పీఏసీఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, జితేందర్ రెడ్డి దొర, డీవై నర్సింలు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, రాము, యువనాయకులు బిర్కడ్ రఘు, అశోక్, శ్రీకాంత్ రెడ్డి, కోట్ల రాజ్ కుమార్, సిద్దు, దత్తు తదితరులు ఉన్నారు.