వరలక్ష్మీ నమోస్తుతే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వరలక్ష్మీ నమోస్తుతే..!
– ఇంటింటా వరలక్ష్మీపూజలు
– శంక‌ర్ యాద‌వ్ నివాసంలో వ్ర‌త‌శోభ‌
– వాయినాలతో మొక్కులు తీర్చుకున్న మహిళలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులో వరలక్ష్మీ వ్రతాలను మహిళలు వైభవంగా జరుపుకున్నారు. శ్రావణమాసంలో శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా పట్టణంలోని కాళీకాదేవి ఆలయంలో అమ్మవారు, నెహ్రుగంజ్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు.

శ్రావణ శుక్రవారం సందర్భంగా పట్టణంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి భావనోళ్ల శంకర్ యాదవ్ నివాసంలో వరలక్ష్మీ వత్ర శోభ సంతరించుకుంది. శంకర్ యాదవ్ సతీమణి చంద్రకళ దంపతులు పత్రాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూజల అనంతరం చంద్రకళ మహిళలకు వాయినాలను సమర్పించుకున్నారు.

మరో వైపు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు తన నివాసంలో వరలక్ష్మీ వత్రాని ఘనంగా జరుపుకున్నారు. అదేవిధంగా పట్టణంలోని మహిళలు ఇంటింటా వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఇంట్లో లక్ష్మీదేవి ప్రతిమలను ప్రతిష్టించి నియమ నిష్టలతో పూజలు చేశారు. లక్ష్మీ పారాయాణాలు పటిస్తూ ప్రార్థనలు చేశారు. కుటుంబాన్ని, పిల్లా పాపలందరిని సల్లంగా చూడాలని లక్ష్మీదేవిలను వేడుకున్నారు.
ప‌ట్ట‌ణంలో ఇండ్ల‌లో నిర్వ‌హించిన వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాల ఫోటోలు