16న సామూహిక జాతీయ గీతాలాపన
– తాండూరు రూరల్ సీఐ రాంబాబు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 16న సామూహిక జాతీయ గీతాలాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తాండూరు రూరల్ సీఐ రాంబాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవాలలో భాగంగా 16 వ తేదీన సర్కిల్ పరిధిలోని తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల మండల పరిధిలోని 139 గ్రామ పంచాయతీలు, 33 అనుబంధ గ్రామ పంచాయతీలలో నిర్ణయించిన ప్రదేశాలలో చిన్నారులు, పెద్దలు, యువకులు, ప్రముఖులు అందరు ఒకేచోట హాజరై సామూహికంగా జాతీయ గీతాలాపాన చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, వార్డు సభ్యులు, యువజన సంఘాలు, విద్యార్థులు అందరు భాగస్వాములు కావాలన్నారు.



