విద్యార్థులకు చేయూత

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థులకు చేయూత
– చిట్టిగణాపూర్‌ ప్లేట్ల పంపిణీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం చిట్టిగణాపూర్ లోని ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులకు చేయూతనందించారు. గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు, స్వర్గీయ నాగప్ప వర్ధంతిని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం వారి కుమారుడు రవి పటేల్ విద్యార్థులకు ప్లేట్లను పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థులకు ఇబ్బందు రావద్దనే ఉద్దేశంతో విద్యార్థులందరికి ప్లేట్లను అందజేశారు. ఈ సందర్బంగా విద్యార్థుల తరుపున పాఠశాల హెచ్ఎం జీ.నర్సిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివప్ప, నర్సింలు, ఉపాధ్యాయులు ప్రమోద్ కుమార్, శశివర్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరును కమ్మేసిన మంచు..!