రోహిత‌న్న‌కు రాఖీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రోహిత‌న్న‌కు రాఖీ..!
– అన్న‌త‌మ్ముళ్ల‌కు ర‌క్ష క‌ట్టిన సోద‌రి
– ఎమ్మెల్యే నివాసంలో పండ‌గ సంద‌డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో ర‌క్షా బంధ‌న్ సందడి నెల‌కొంది. శుక్ర‌వారం రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఆయ‌న త‌మ్ముడు రితేష్ రెడ్డిల‌కు వారి సొద‌రి మౌనిక రాఖీ క‌ట్టింది. తాండూరులోని ఎమ్మెల్యే నివాసంలో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల‌కు ఆమె హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం పూజ‌లు నిర్వ‌హించి బొట్టు పెట్టిన త‌రువాత ఇద్ద‌రికి రాఖీ క‌ట్టింది. అనంత‌రం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డిలు సోద‌రి అశీర్వాదం తీసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా ప్ర‌జ‌లు అంద‌రికీ రాఖీ పౌర్ణ‌మి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ రోజు రాఖీ క‌ట్టుకున్న‌ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లకి రక్షగా నిలుస్తామని భ‌రోసా ఇవ్వాల‌న్నారు. అదేవిధంగా ప్ర‌భుత్వం పిలుపునిచ్చిన విధంగా వ‌జ్రోత్స‌వ సంబ‌రాల‌ను జ‌య‌ప్ర‌దం చేయాల‌న్నారు.