సంతోషం పంచిన స్వ‌ప్న ప‌రిమ‌ళ్

తాండూరు రాజకీయం వికారాబాద్

సంతోషం పంచిన స్వ‌ప్న ప‌రిమ‌ళ్
– వ‌స‌తి గృహ విద్యార్థుల‌తో ర‌క్షాబంధ‌న్‌
– విద్యార్థుల‌కు రాఖీ క‌ట్టిన చైర్ ప‌ర్స‌న్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : పండ‌గ‌కు దూరంగా ఉన్న వ‌స‌తి గృహ విద్యార్థుల‌లో తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ సంతోషాన్ని నింపారు. రాఖీ పౌర్ణ‌మిని పుర‌స్క‌రించుకుని విద్యార్థులతో ర‌క్షా బంధ‌న్ వేడుక‌ల‌ను జ‌రుపుకున్నారు. శుక్ర‌వారం తాండూరు ప‌ట్ట‌ణం హైద‌రాబాద్ రోడ్డు మార్గంలోని బీసీ వ‌స‌తి గృహాన్ని చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ సంద‌ర్శించారు. రాఖీ పౌర్ణ‌మి రోజు అయినా కొంద‌రు విద్యార్థులు పండ‌గ‌కు ఊరికి వెళ్ల‌క‌పోవ‌డంతో వారితో క‌లిసి చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ పండ‌గ‌ను జ‌రుపుకున్నారు. విద్యార్థుల‌కు రాఖీలు క‌ట్టి పండ‌గ శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ రాఖీ క‌ట్ట‌డంపై సంతోషం వ్య‌క్తం చేశారు. విద్యార్థుల‌కు అండ‌గా ఉంటూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తోడుగా ఉంటాన‌ని హామి ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో హాస్ట‌ల్ ప్ర‌తినిధి శ్రీ‌శైలం, సిబ్బంది పాల్గొన్నారు.