గొల్ల కురుమలకు  విద్య, రాజకీయాలతో గుర్తింపు

తాండూరు రాజకీయం వికారాబాద్

గొల్ల కురుమలకు  విద్య, రాజకీయాలతో గుర్తింపు
– ఐక్యతతోనే అన్ని రంగాల్లో రాణింపు 
– ఎంపీడీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్తయ్య కురుమ
– తెలంగాణ గొర్రెల మేకల పెంపకదారుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : గొల్ల కురుమలు అన్ని రంగాల్లో పైచేయి సాధించాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీడీఓ సంఘం అధ్యక్షులు సత్తయ్య కురుమ అన్నారు. ఆదివారం తాండూరులో తెలంగాణ గొర్రెల మేకల పెంపకదారుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ఎంపీడీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్తయ్య కురుమ, సీడబ్ల్యూసీ మెంబర్ ధనసిరి ప్రకాష్, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, సంఘం నియోజకవర్గ అధ్యక్షులు పల్లె వెంకటయ్య తదితరులు హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్తయ్య కురుమ మాట్లాడుతూ గొల్ల కురుమలు విద్యా, రాజకీయాలలో అందరు ఐక్యంగా ఉంటే గుర్తింపును పొందడం సాధ్యమవుతుందన్నారు. గొల్ల కురుమల పిల్లలు చక్కగా చదువుకుని అన్ని రంగాల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు. జెడ్పీటీసీ గౌడి మంజుల మాట్లాడుతూ గొల్ల కురుమలు అభివృద్ధి చెందాలంటే ఒకరికొకరు తోడ్పాటు అందించుకోవాలన్నారు. సీడబ్ల్యూసీ మెంబర్ ధనసిరి ప్రకాష్ మాట్లాడుతూ గొల్ల కురుమలు ఓటేయాడానికే పరిమితం కాకుండా రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. రాజకీయాల్లో గొల్ల కురుమలు ముందుంటేనే అభివృద్ధి చెందుతారని అన్నారు. గొర్రెల మేకల పెంపకదారుల సంఘం తరుపున క్యాలెండర్ ఆవిష్కరించడం పట్ల అందరు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గౌడి వెంకటేశం, స్వచ్చంద సంఘం ప్రతినిధి మరాఠీ రాములు, సంఘం పెద్దలు హన్మయ్య, నర్సింలు, మల్కాపూర్ భీమయ్య, వీర్ శెట్టిపల్లి చీమల నర్సింలు, రాములు, కొత్లాపూర్ సర్పంచ్ బుడ్డెళ్లి సాయిలు, అంతారం ఎంపీటీసీ శాంతు, కుర్వ శ్రీనివాస్, అల్లాపూర్ శ్రీనివాస్, కొల్లాపూర్ సురేష్, కళ్యాణ్ రమేష్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.