కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు.. మోసపోవద్దు..!
– కారును గెలిపిస్తే సంక్షేమం మరింత ముందుకు
– అభివృద్ధి చేసేందుకు మరో అవకాశం ఇవ్వండి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఎమ్మెల్యే ప్రచారానికి జన నీరాజనాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు.. నమ్మి మోసపోసవద్దని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని సాయిపూర్ 9, 10, 11, 12వ వార్డుతో పాటు 13, 14, 15, 16, 19, 20, 21, 22వ వార్డు. 3,4వ వార్డులలో ప్రచార కార్యక్రమం చేపట్టారు.

ఆయా వార్డులో కొనసాగిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి వార్డు ప్రజలు, నేతలు, కార్యకర్తలు నీరజానాలు పలికారు. జనం మద్యకు వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మహిళలు చేతులతో ఆశీర్వదించి దీవించారు. ఆయా వార్డుల్లో జనాలు కిక్కిరిసి పైలెట్ ప్రచార యాత్రను జైత్రయాత్రగా మార్చి ముందుకు సాగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో తాండూరు ప్రాంతం ఎంతో వివక్షకు గురయ్యిందన్నారు. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి. సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. మిషన్ భగీరథ, అసరా, కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ తదితర పథకాలతో పేదలు ఎంతో లబ్దిపొందారని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా తాండూరును ఆదర్శంగా నిలిపిన ఘనత దక్కిందన్నారు. రూ.1600 కోట్లతో తాండూరు రూపురేఖలు మార్చడం జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆదరిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఎన్నికల ముందు వచ్చే కాంగ్రెస్ పార్టీని నమ్మరాదన్నారు. నమ్మితో మోసపోవడం.. మళ్లీ వివక్షకు గురికావడం తప్పదన్నారు.
కావున కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి.. కాంగ్రెస్ పార్టీకి బుద్దిచెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, మార్కెట్ కమిటి చైర్జ్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రమ్మ, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

