విద్యుత్ స్థంభాల‌ను మార్పించండి

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

విద్యుత్ స్థంభాల‌ను మార్పించండి
– వ‌ర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా చ‌ర్య‌లు తీసుకోండి
– ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో కౌన్సిల‌ర్ ప్రవీణ్ గౌడ్‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప్ర‌మాదాల‌కు కార‌ణ‌య్యే ఇనుప‌ విద్యుత్ స్థంబాల‌ను మార్పించాల‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని మున్సిప‌ల్ 30 వ వార్డు కౌన్సిల‌ర్ ప్రవీణ్ కుమార్‌గౌడ్ కోరారు. గ‌ల్లి గ‌ల్లికీ ఎమ్మెల్యే కార్య‌క్ర‌మంలో భాగంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి 30 వ వార్డులో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కౌన్సిల‌ర్ ప్రవీణ్ గౌడ్ త‌న వార్డు స‌మ‌స్య‌ల‌ను ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి దృష్టికి తీసుక‌వ‌చ్చారు. వార్డులోని బాలాజీ మందిర్ వెనుక‌భాగంలో పారిశుద్ధ్య స‌మ‌స్య తిష్టవేసింద‌ని తెలిపారు. అదేవిధంగా వార్డులో దాదాపు 30 నుంచి 40 వ‌ర‌కు ఇనుప విద్యుత్ స్థంభాలు ఉన్నాయ‌ని, విద్యుత్ ప్ర‌మాదాలు లేకుండా అట్టి స్థంభాల‌ను మార్పించాల‌ని ఎమ్మెల్యేను కోరారు. దీంతో పాటు బ‌స‌వ‌ణ్ణక‌ట్ట వ‌ర్షాకాలంలో నీరు నిలిచి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయ‌ని, అ ప్రాంతంలో సైడ్ డ్రైన్, క‌ల్వ‌ర్టు నిర్మించేలా నిధులు మంజూరు చేయించాల‌ని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సానుకూలంగా స్పందించి ద‌శ‌లవారిగా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌ని హామి ఇచ్చిన‌ట్లు కౌన్సిల‌ర్ ప్రవీణ్ గౌడ్ తెలిపారు.