ఈడీ నోటీసులు కక్ష్య సాధింపే..!

తాండూరు తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

ఈడీ నోటీసులు కక్ష్య సాధింపే..!
– నోటీసుల విషయం బండికి ఎలా తెలుసు
– భయపడేది లేదు.. న్యాయపరంగా జవాబిస్తా
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: తనకు ఈడీ నోటీసులు పంపడం కేంద్రం కక్ష్య సాధింపు చర్యనే అని వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం జారీ అయిన ఈడీ నోటీసులపై సాయంత్రం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. ఉదయమే తనకు ఈడీ నోటీసులు వచ్చాయని, తనకు ఈడీ నోటీసులు అందించడం హస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కాని కర్ణాటక డ్రగ్స్ కేసులో నాకు నోటీసులు రాలేదని కొట్టిపారేశారు. తనకు సంబంధం లేదని డ్రగ్‌ కేసులో తన పేరును ప్రస్తావించడంలో అంతర్యమేంటో అని అర్థం కావడం లేదన్నారు. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహరంలో తాను కీలకంగా ఉన్నందునే కేంద్రం ద్వారా ఈడీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. తనకు ఈడీ నోటీసులు పంపిస్తున్న విషయం బండి సంజయ్‌కి ఎలా తెలుసని ప్రశ్నించారు. ఇక్కడే కేంద్రం కుట్ర అర్థం చేసుకోవచ్చన్నారు. దీనికి యాదాద్రిలో తడిగుడ్డలతో ప్రమాణం చేసేందుకు సిద్దమని, ఈ సవాల్‌ను బండి సంజయ్ స్వీకరిస్తారని అంటూ ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేక కక్షసాధింపు చర్యకు పాల్పడుతున్నారని అన్నారు. ఈడీ నోటీసులకు భయపడేది లేదు..తగ్గేదెలేదన్నారు. తనకు నోటీసుల అందించిన అంశంపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. న్యాయ అధికారులను సంప్రదిస్తున్నామన్నారు. ఈడీ, సీఐడీ దాడులకు బయపడను అని పేర్కొన్నారు.